సూపరో సూపర్ .. ఇడ్లీ ఒక్క రూపాయి
Timeline

సూపరో సూపర్ .. ఇడ్లీ ఒక్క రూపాయి

తమిళనాడులో సబ్సిడీ ధరలతో టిఫిన్‌, భోజనం అందించే అమ్మ క్యాంటిన్లను జయలలిత 2013లో ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు ఈ పథకాన్ని అనుసరించాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఈ పథకాన్ని మరింత చేరువగా తీసుకెళ్ళింది పళనిస్వామి ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి మొబైల్‌ అమ్మ క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ క్యాంటీన్లు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తాయి.

ఇడ్లీ ఒక్క రూపాయికి, పొంగల్‌ను రూ. 5లకు ఈ క్యాంటీన్‌లో అందిస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సాంబార్‌ అన్నం, పులి హోరను రూ. 5లకు… పెరుగు అన్నం రూ. 3లకు అందిస్తారు. ఆధునాత సౌకర్యాలు ఉన్న ఈ మొబైల్‌ క్యాంటీన్ల సంఖ్యను 50కు పెంచుతామని సీఎం పళనిస్వామి అన్నారు.