కీలకంగా మారిన దిశా ఫోన్‌

15

దిశా రేప్ అండ్ మర్డర్ కేసులో ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉందని.. నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని షాద్ నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దిశా మొబైల్ ఫోన్‌ను రికవరీ చేయాల్సి ఉందని.. నిందితుల వాంగ్మూలం కూడా రికార్డు చెయ్యాల్సి ఉందని వెల్లడించారు. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నలుగురు నిందితులను 10 రోజుల పాటు పోలిసుల కస్టడీకి అప్పగించింది.

ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ ‌ ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు.