కొత్త వ్యవసాయ చట్టాలపై వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు రాసిన లేఖను చదవాలని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వివిధ భాషలలో రైతులకు విజ్ఞప్తి చేశారు. పంజాబ్-హర్యానా వెలుపల నిరసనలు పెరుగుతున్నాయని స్పష్టంగా ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు ఇది సంకేతం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇప్పటి వరకు, ప్రభుత్వ సందేశం ఎక్కువగా హిందీ మరియు పంజాబీలలో ఉంది. గత వారం సన్యుక్త కిసాన్ మోర్చాకు పంపిన మూడు చట్టాలకు సవరణల వ్రాతపూర్వక ప్రతిపాదన కూడా హిందీ మరియు పంజాబీలలో ఉంది. ఢిల్లీ సరిహద్దుల ముట్టడిలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి వచ్చిన రైతుల ఆందోళన కారణంగా బెంగాలీ, గుజరాతీ మరియు ఒడియా మినహా అన్ని దక్షిణ భాషలలో శనివారం ట్వీట్లు చేసారు ప్రధాని మోడీ.

ఒకవైపు రైతులు ఒప్పించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పంజాబ్ లో కమీషన్ ఏజెంట్లపై ఇంకమ్ ట్యాక్స్ రైడ్స్ జరిపిస్తుంది. నిరసన తెలిపిన రైతులు ఆదాయపు పన్ను దాడులను తమను బెదిరించే ప్రయత్నంగా చూస్తారు. ఈ దాడుల్లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మిడిల్ మెన్ అని పిలిచే కమీషన్ ఏజెంట్లు, రైతులు తమ ఉత్పత్తులను కొనుగోలుదారులకు – ప్రైవేట్, ప్రభుత్వం లేదా ఎగుమతిదారులకు విక్రయించడంలో సహాయపడతారు – ధాన్యాన్ని దించుట, శుభ్రపరచడం, సంచులలో నింపడం మరియు ట్రక్కులపై బరువు, సీలింగ్ మరియు లోడ్ చేయడం వంటి సేవలను అందించడంతో పాటు రైతులకు రుణాలు కూడా ఇస్తారు. వారి పనులకు కూడా ఈ కొత్త చట్టాలు అడ్డంకి అని వారు భావించడమే రైతులతో పాటు ధర్నా చేయడానికి కారణం.

శనివారం సాయంత్రం, అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్సిసి) కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ తోమర్ రాసిన లేఖపై స్పందించింది. అంతే కాకుండా రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన అపవాదు ప్రచారాన్ని ఎదుర్కోవటానికి కూడా ఇది ప్రయత్నించింది. ఆరు నెలలుగా శాంతియుతంగా కొనసాగుతున్న ఒక ఉద్యమంపై అధికారులు అనుమానాలకు ఆజ్యం పోస్తున్నారని ఎఐకెఎస్‌సిసి తెలిపింది.

ఎ.ఐ.కె.ఎస్.సి పిలుపు మేరకు నవంబర్ 26 నుండి ఢిల్లీ సరిహద్దులను ముట్టడి చేయడానికి ముందు, రైతులు తమ సొంత రాష్ట్రాల్లోనే ఆందోళన చేసారు, పంజాబ్ రైతులు అత్యంత నిరంతర ప్రచారం చేపట్టారు.
ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారనే ప్రభుత్వం చేస్తున్న నిరంతర ఆరోపణలపై, AIKSCC ఇది రైతుల ఉద్యమం అని నొక్కి చెప్పింది, బదులుగా, అనేక పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవలసి వచ్చింది. రైతుల నిరసన జాతీయ ప్రయోజనానికి సంబంధించినది కాదన్న బిజెపి నాయకుల ఆరోపణపై, ఎఐకెఎస్సిసి ఇలా అన్నారు: “మన దేశం ఇప్పటికీ చాలావరకు వ్యవసాయ దేశమే. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాల కోసం కాదని, వారి గొంతు వినకూడదని మీరు చెబుతున్నారా? లేదా మీ ఉద్దేశం ప్రకారం పెద్ద కార్పొరేట్ మరియు విదేశీ కంపెనీల అభివృద్ధి మాత్రమే జాతీయ ప్రయోజనంలో ఉందా ?.

రైతుల ఆందోళనకు మద్దతుగా డిసెంబర్ 26 న ఢిల్లీ కవాతుకు నాయకత్వం వహిస్తున్నట్లు రాజస్థాన్ ఎంపి, బిజెపి మిత్రపక్షమైన లోక్తాంత్రిక పార్టీ నాయకుడు హనుమాన్ బెనివాల్ శనివారం ప్రకటించారు. “రైతుల నిరసనను అరికట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది” అని బెనివాల్ రైతులకు సంఘీభావంగా మూడు పార్లమెంటరీ కమిటీల సభ్యత్వాలకు రాజీనామా చేసిన తరువాత చెప్పారు. “అందువల్ల, డిసెంబర్ 26 న రాజస్థాన్ నుండి ఢిల్లీ వైపు రెండు లక్షల మంది రైతులు మరియు యువకుల కవాతుకు నాయకత్వం వహించాలని మా పార్టీ నిర్ణయించింది” అని నాగౌర్ ఎంపి అన్నారు.

హర్యానాకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బిరేందర్ సింగ్ 2014 లో బిజెపిలో చేరడానికి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. ఆయన కూడా రైతుల నిరసనకు మద్దతునిచ్చారు. సింగ్ రైతు నాయకుడు సర్ చోతు రామ్ మనవడు మరియు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఇంకా బిజెపితో సంబంధాలు తెగిపోలేదు. “నేను సర్ చోతు రామ్ మనవడు కాకపోతే రాజకీయాల్లో నేను సాధించినది సాధ్యం కాదు” అని సింగ్ శుక్రవారం అన్నారు. “అందువల్ల, ఈ రోజు వారి పోరాటంలో రైతులతో కలిసి నిలబడటం నా నైతిక బాధ్యత. ఈ (రైతుల) పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను, ”అని సింగ్ అన్నారు.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రైతు బిల్లులకు మద్దతు ఇచ్చినా రైతు ధర్నా మొదలైన తరువాత ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులకు మద్దతు పలికారు. ఇక దక్షిణ భారత దేశంలో ఇప్పటికే కేరళ లో రైతుల నిరసన మొదలైంది. అక్కడ ఉన్న సిపిఐఎం పార్టీ మోడీ ప్రభుత్వానికి బద్ద శత్రువులు. వారు ఇప్పటికే రైతుల ధర్నాలకు మద్దతు పలికారు. ఇక హైదరాబాద్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి తాము కొత్త వ్యవసాయ చట్టాల బిల్లు కు ఓటు వేయలేదు అని , రైతులకు మా మద్దతు ఉంటుందని గట్టిగా చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బిల్లుకు ఓటు వేసినా , రైతుల ధర్నాకు మద్దతు పలికారు ఆ పార్టీ నేతలు. దీంతో రైతు చట్టాలపై ఒక్క బీజేపీ తప్ప బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్ని పార్టీలు రైతుల వైపే ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.

మరి బీజేపీ వెనక్కు తగ్గుతుందా , రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తారా చూడాలి.

Leave a Reply

Your email address will not be published.