వాట్సాప్ ఇప్పటికే తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్ సర్వీసుల కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. గతంలోనే ఈ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ప్రైవసీ కారణాలరీత్యా ఎన్‌పీసీఐ వాట్సాప్ పేమెంట్ సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్‌పీసీఐ నుంచి వాట్సాప్‌కు పేమెంట్ సర్వీసుల కోసం ఆమోదం తెలిపింది.
అయితే డేటా లోకలైజేషన్ రూల్స్‌ను వాట్సాప్ పాటించకపోవడంతో ఎన్‌పీసీఐ నుంచి దీనికి అనుమతి రాలేదు.వాట్సాప్‌కు ఇప్పుడు ఎన్‌పీసీఐ నుంచి పేమెంట్ సర్వీసులకు అనుమతి లభించింది. వాట్సాప్ తన పేమెంట్ చెల్లింపుల కోసం ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో జతకట్టనుంది. ఇకపోతే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. పేమెంట్స్ డేటా, పేమెంట్స్ ఇన్‌ఫర్మేషన్, సెటిల్‌మెంట్ ట్రాన్సాక్షన్లు, కస్టమర్ డేటా వంటి సమాచారం మొత్తాన్ని కంపెనీలు ఇండియాలోనే స్టోర్ చేయాలి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ ద్వారా యుపిఐ చెల్లింపులను క్లియర్ చేసిన కొన్ని గంటల తరువాత, ఫేస్బుక్ సిఇఒ మార్క్ జుకర్బర్గ్ మాట్లాడుతూ, డబ్బు పంపడం ఇప్పుడు సందేశం పంపినంత సులభం అవుతుంది అని తెలిపారు.
“ఇప్పుడు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సందేశం పంపినంత తేలికగా డబ్బు పంపవచ్చు. ఎటువంటి రుసుము లేదు మరియు దీనికి 140 కంటే ఎక్కువ బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయి. ఇది వాట్సాప్ కనుక, ఇది సురక్షితమైనది మరియు మీ సమాచారం ప్రైవేట్‌గా ఉంటుంది, ”అని అతను వీడియో సందేశంలో చెప్పాడు.