హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కాస్త హత్యకు దారి తీసింది. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొని , ఆ తరువాత తన కూతుర్ని ఇచ్చి వాడితోనే పెళ్లి చేసిందొక మహిళ. తల్లితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం విషయం బయటపడటంతో అత్యంత్య చేసుకొని చనిపోయింది ఆ అమాయకురాలు. ఈ విషయంలో అత్త ,అల్లుడు ఇద్దరు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వచ్చిన తరువాత మళ్ళీ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ అల్లుడు టార్చర్ భరించలేక ఆ అత్త అల్లుడినే హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉప్పల్ రామంతపూర్, కేసీఆర్ నగర్‌కు చెందిన నీవన్ అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం అనిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం అనిత తన కూతురు వందనను నవీన్‌కు ఇచ్చి వివాహం చేసింది. నవీన్ వేధింపులు భరించలేక, తల్లి, భర్తల వివాహేతర సంబంధం బయటపడటంతో వందన నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
బుధవారం రాత్రి అతడు నిద్రపోతుండగా కత్తితో నరికి చంపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. నిందితురాలు అనితపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.