భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఈ విషయాన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో మెసేజ్ ద్వారా శనివారం సాయంత్రం ప్రకటించాడు. వన్డే, టెస్ట్, టీ20 అన్ని ఫార్మట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు ధోనీ. 38 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.
ADVERTISEMENT
స్వాతంత్ర్య దినోత్సవం రోజున లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
ADVERTISEMENT
ధోనీ చివరి సారిగా 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆడాడు. 2019, జులై 19న ఆడిన ఆ మ్యాచే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్.