జగన్ పై యం యస్ స్వామినాథన్ ప్రశంసలు

ఏపీలో అన్నదాతల కోసం జగన్ సర్కార్ కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో 10.641 కేంద్రాలు.. సీఎం యాప్‌, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను కూడా లాంఛ్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.. శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. అంతేకాదు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు కాల్‌సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ 155251.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని.. అదే రోజు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధితో.. నిజాయితీగా జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం తీసుకొచ్చామని.. ఈ పథకం కింద 49 లక్షల రైతు కుటుంబాలకు రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గాలని.. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈ కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకూ సూచనలు, సలహాలు ఇస్తాయన్నారు. పంట రుణాలు, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర కల్పించేలా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయన్నారు జగన్.

అయితే జగన్ ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలపై దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది. అంతే కాకుండా ఫాదర్ అఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయిన యం యస్ స్వామినాథన్ కూడా జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ రైతుల కోసం తీసుకు వస్తున్న సంక్షేమ పథకాలు తనకు ఆనందాన్ని కలగజేస్తున్నాయని. ఎవరు చేయనిది జగన్ చేస్తున్నాడు అని. యంగ్ & డైనమిక్ ఆంధ్ర ముఖ్యమంత్రికి జగన్ కు నా కృతజ్ఞతలు అని తెలిపారు.

ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప వ్యక్తి యం యస్ స్వామినాథన్. ఆయనే జగన్ పథకాలను ప్రశంసించటం అంటే ఇది వైసీపీ ప్రభుత్వానికి గొప్ప విజయమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజల్లో జగన్ పై మరింత ఆదరణ లభిస్తుంది. ఈ పథకాల అమలుతో ఇంకా ప్రజలకు చేరువయ్యాడు జగన్