అభిజీత్ పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు… అరియానే అసలు విన్నర్
Timeline

అభిజీత్ పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు… అరియానే అసలు విన్నర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజీత్ పై ఆ షో కంటెస్టెంట్ & మాజీ జబర్ధస్త్ కమెడియన్ అవినాష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ఫ్రెండ్ అరియానా సీజన్ టైటిల్ విన్నర్ అవుతుందని తాను అంచనా వేశానన్నాడు.

అయితే బిగ్ బాస్ టైటిల్ గెలిచినా… తన ప్రకారం అభిజీత్ బెస్ట్ కాదన్నాడు. ఆడియెన్స్ కేవలం ఓ గంట షో చూస్తారని.. కానీ ఇంట్లో 24 గంటల పాటు వారి వెంట ఉన్న వ్యక్తిగా తాను ఈ కామెంట్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏదేమైనా ఆడియెన్స్ నిర్ణయం ఫైనల్ అన్నాడు.

అయితే అవినాష్ కామెంట్లపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఆ గంట షో చూసి ఓట్లు వేశాం కాబట్టే అన్ని రోజులు నెట్టుకు రాగలిగవు లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడివి అని , ఇపుడు ఇంకా అరియనా ను ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఇంకా కామెంట్లు చేస్తూ దిగజారడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.