జనవరిలో మున్సిపల్ ఎన్నికలు …

తెలంగాణలో త్వరలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతుంది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడం, హైకోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.

అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం వార్డుల విభజనను త్వరలో పూర్తి చేయనుంది. అయితే వార్డుల విభజన తర్వాతే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. అయితే మొన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల తరువాత రానున్న ఎన్నికలు కానుండడంతో అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.