తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్-NAAC) గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్‌సెట్ ద్వారా ప్రకటించడం గమనార్హం. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ పంపడంలో భాగంగా న్యాక్ బెంగళూరుకు నకిలీ పత్రాలను పంపించారు. అయితే, న్యాక్ కౌన్సిల్ వారు ఈ విషయాన్ని పసిగట్టారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యాజమాన్యం చీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలు తీసుకున్నారు. అక్రిడేషన్ విషయంలో 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించారు. ఈ విషయాన్ని న్యాక్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, క్యాంపస్ 1, ధూలపల్లి రోడ్, మైసమ్మగూడ పోస్ట్, కోంపల్లి, రంగారెడ్డి జిల్లా, సికింద్రాబాద్, తెలంగాణ-500100 అనే అడ్రస్‌ను పేర్కొంటూ ఈ కాలేజీ న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియ నుంచి బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు వెబ్‌సైట్‌లో ప్రకటించారు. దీంతోపాటు విజయవాడ శివారు పెనమలూరులో ఉన్న ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీపైన కూడా ఇలాంటి వేటే పడింది.
Timeline
మల్లారెడ్డి కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టిన NAAC
- by Telugucircles
- December 25, 2020
- 0 Comments
- 7 Views
