చైతన్యతో మెగా ప్రిన్స్ నిహారిక పెళ్లి ఫిక్స్?
Timeline

చైతన్యతో మెగా ప్రిన్స్ నిహారిక పెళ్లి ఫిక్స్?

నిహారిక… ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ మధ్య సినిమాల కంటే ఆమె పెళ్లిపై వచ్చే గాసిప్స్‌ ద్వారానే నిహారిక ఇంకా ఫేమస్‌ అయ్యారు. అయితే నిహారిక పెళ్లి త్వరలోనే చేయబోతున్నామని మెగా బ్రదర్‌ నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ వార్త నిజమేననట్లు నిహారిక ఒక కప్పుపై మిస్‌ నిహారిక అని పేరును కొట్టేసి, మిసెస్‌ అని రాసి కొశ్చన్‌ మార్క్‌ పెట్టింది. దీంతో పెళ్లి నిజంగానే ఫిక్స్‌ అయ్యిందని అందరూ భావిస్తున్నారు.


అయితే ఈ రోజు (గురువారం) తాజాగా ఒక వ్యక్తిని హగ్‌ చేసుకొని ఉన్న ఫోటోను నిహారిక తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో అందరూ నిజంగా నిహారిక పెళ్లిని పెద్దలు నిశ్చయించేశారని అనుకుంటున్నారు. అయితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం ముఖం కనిపించడం లేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అతనే నిహారికకు కాబోయే భర్త అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్‌తో, ఇతర హీరోలతో నిహారిక పెళ్లి అని అనేక గాసిప్‌లు సృష్టించారు. అయితే ప్రస్తుతం నిహారిక గుంటూరుకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడు చైతన్యను చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్త ఎంతవరకు నిజమో కొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

నిహారిక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు చైతన్యాన్ని తన ఒక ఫోటోగ్రాఫర్ అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.