కోట శ్రీనివాస్ రావుపై నాగబాబు నీచమైన కామెంట్లు
Timeline Tollywood

కోట శ్రీనివాస్ రావుపై నాగబాబు నీచమైన కామెంట్లు

గత నెల రోజులుగా మీడియా మొత్తమ్ మా ఎన్నికల అంశాన్ని నెత్తినేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఉప ఎన్నికలను సైతం మీడియా పక్కన పెట్టేసింది అంటే ఏ రేంజులో మా ఎన్నికల వేడి ప్రజల్లోకెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజుకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ప్రకాష్ రాజుకి ప్రత్యర్థిగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు బరిలోకి దిగాడు. అక్కడ మొదలైన వివాదం రోజు రోజుకీ ముదురుతూ వచ్చింది.

లోకల్ నాన్ లోకల్ , తెలుగు భాషపై ఎవరికెంత పట్టుందో అంటూ అన్ని యాంగిల్స్ లో ఈ వివాదం పీక్స్ కి వెళ్ళింది. ఇప్పుడు ప్రకాష్ రాజుకి మద్దతుగా నాగ బాబు తెరపై వచ్చారు. రావడంలో తప్పు లేదు కానీ విష్ణు కి మద్దతు తెలుపుతున్న కోట శ్రీనివాస్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆయన వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా నోరు జారారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

నాగబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని , వెంటనే కోట కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/telugucircles/status/1446869597823516676?s=20