తెలంగాణ పోలీసులపై హోకోర్టులో రిట్ పిటీషన్

తమ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో రాష్ట్ర పోలీసుల చర్యను సవాలు చేస్తూ నాగ్‌పూర్‌కు చెందిన ఎస్‌జిఎస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

మామిడి, అరటి మరియు బొప్పాయి వంటి పండ్లను పండించటానికి సాచెట్ల రూపం లో దిగుమతి చేసుకున్న ఈథెఫోన్ (ఇథిలీన్ గ్యాస్) ను కొనుగోలు చేస్తున్న వినియోగదారులను, వ్యాపారులను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.

పిటిషనర్ సంస్థ కార్బైడ్ మరియు ఎసిటిలీన్ వాయువులపై నిషేధం ఉందని పేర్కొంది (ఇవి పండ్లను కృత్రిమంగా పండించటానికి ఉపయోగిస్తారు), అయితే కేంద్రం ప్రత్యామ్నాయాన్ని అంటే ఇథిలీన్ వాయువును చట్టబద్ధం చేసింది. ఇథిలీన సాచెట్లను FSSAI ఆమోదించింది. అయితే వాణిజ్య లైసెన్స్, ఇతర ఆమోదాలు ఉన్నప్పటికీ, పోలీసులు దాని కొనుగోలుదారులను మరియు వ్యాపారులను అరెస్టు చేస్తున్నారని, తప్పుడు కేసులను బుక్ చేస్తున్నారు అని పిటీషన్ లో పేర్కొంది