రాజధాని విషయంలో లోకేష్ యూ-టర్న్

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి’.. ‘సవ్ అమరావతి’.. పేరుతో చేపట్టిన దీక్షా శిబిరం సాక్షిగా టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై గందరగోళం నెలకొన్నవేళ.. లోకేశ్ అనూహ్యంగా ‘అవనిగడ్డ’ పేరును తెరపైకి తెచ్చారు. రాజధానిని అమరావతిలో కాకుండా కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డలో ఏర్పాటుచేస్తానని సీఎం జగన్ ప్రకటిస్తే.. దానికి టీడీపీతోపాటు రాష్ట్ర ప్రజలెవరూ అభ్యంతరం చెప్పబోరని అన్నారు.

విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల నిరసన ముగియడంతో.. లోకేశ్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సదర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించాలని ఆ ప్రాంతవాసులు ఏరోజూ డిమాండ్ చేయలేదని, కనీసం రాజధాని రావాలని కోరుకోనూలేదని, అలాంటప్పుడు సీఎం జగన్ రాజధాని మార్పుపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావట్లేదని లోకేశ్ వాపోయారు.

రాజధాని రాబోతోందని తెలిసిన తర్వాత విశాఖ ప్రజలు భయంతో వణికిపోతున్నారని, వైసీపీ భూకబ్జాదారులు ఎంటరైతే బతుకులు ఆగమైపోతాయేమోననే కంగారు విశాఖవాసుల్లో నెలకొందని చెప్పారు. రాయలసీమ మారే చాన్సేలేదు.. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన నారా లోకేశ్.. జ్యూడీషియల్ క్యాపిటల్ పేరుతో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ బాగుపడే అవకాశమే లేదని, ఈ విషయం అక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

కొత్త వార్తలు