Breaking News :

ఎన్టీఆర్ పేరు వినపడకూడదనే నారా రోహిత్ ఎంట్రీ

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా అమరవాతి గ్రామాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. రైతుల పోరాటానికి టీడీపీ, జనసేన మరియు వామపక్ష పార్టీలన్ని కూడా మద్ధతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజు రోజుకు రైతుల పోరాటం ఉదృతం అవుతున్న టాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ సమస్యపై ఇంతవరకు స్పందించలేదు.

అయితే తాజాగా ఇండస్ట్రీ నుంచి రైతుల పోరాటానికి హీరో నారా రోహిత్ మద్ధతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది అంటూ విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి, ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా, అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటానని నారా రోహిత్ ప్రకటించారు.

టీడీపీ భవిష్యత్తు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని ప్రజల్లో ఉన్న భావన. అయితే చాల కాలంగా టీడీపీకి దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ . అయితే నారా లోకేష్ ని పైకి లేపడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు కావాలనే అణగతొక్కారని విమర్శలు కూడా ఉన్నాయి. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం చాల ఉందనే వాదన మళ్ళీ తెరపైకి రావడం వల్లే నారా రోహిత్ మరియు తదితరులను తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చి ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని తెలుపాలని చూస్తున్నారట. దానిలో భాగమే ఇలా రాజకీయాల్లో యాక్టీవ్ గా రోహిత్ ఉండబోతున్నట్టు సమాచారం.

Read Previous

‘జాను’ టీజర్ విడుదల

Read Next

వారు కోర్టుకు రావడం లేదు