Breaking News :

కరోనా వైరస్: పోరాటం ముగించుకొచ్చిన ‘నారప్ప’

వెంకటేష్ ‘నారప్ప’ పేరుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేసారు. ఈ లోపే వెంకటేష్ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు పూర్తి చేయడం విశేషం. తాజాగా ఈ సినిమాకు షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ సినిమాకు యూనిట్ హైదారాబాద్ బయలు దేరి వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ వెంకటేష్‌ను అభినందిస్తున్నారు. అంతేకాదు ఈ షెడ్యూల్‌కు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకు రీమేక్ గా రాబోతున్నఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియ‌మ‌ణి, రెబా జాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Read Previous

సిఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం

Read Next

నియంత్రణలోకి కరోనా.. పట్టు సాధిస్తున్న చైనా.. తొలిసారిగా..?