Breaking News :

వావ్: టామ్ క్రూజ్ తో అంతరిక్షంలో సినిమా తీయనున్న నాసా

అవును మీరు చదివిన హెడ్ లైన్ నిజమే అలా అని ఇదేదో అంతరిక్షంలో సినిమా అంటే ఇంతకముందు వచ్చిన సినిమాల లాగా ఇక్కడే భూమి మీద ఏదో ఒక స్టూడియో లో సెట్ వేసి అందులో తీయడం కాదు.

నాసా మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ కలిసి నిజంగానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సినిమా షూట్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా జరిగితే ఈ సినిమా విశ్వంలోనే మొట్టమొదటి అంతరిక్షంలో తీసిన చిత్రం అవుతుంది.

ఈ వార్తను నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్  మంగళవారం ఒక ట్వీట్‌లో ప్రకటించారు . ఈ ప్రయత్నం “ నాసా యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికలను సాకారం చేయడానికి, కొత్త తరం ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలను ప్రేరేపించడానికి ఒక గొప్ప మీడియం గా ఉపయోగపడుతుందని తెలిపారు.

అంతే కాకుండా నాసా అంతరిక్ష కేంద్రంలో షూట్ చేసే ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నాము అని బ్రిడెన్‌స్టైన్ అన్నారు .

అయితే ఇందులో 54 ఏళ్ళ టామ్ నటించడం విశేషం. తమ సొంత నైపుణ్యాలను సినిమాల్లో ప్రదర్శించే, ప్రపంచంలోనే అతి తక్కువ నటులలో టామ్ ఒకడు అని చెప్పొచ్చు. అయితే ఈ లొకేషన్ వివరాలు తప్ప సినిమా దేని గురించి ఉండబోతుంది, దాని కథేంటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

2000 సంవత్సరంలో ISS, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని నిర్మించారు. అప్పటి నుండి చాలా మంది వ్యోమగాములు అక్కడికి వెళ్లి వచ్చారు. అంతే కాదు బాగా డబ్బున్న వ్యక్తులు కూడా రష్యా లోని స్పేస్ ఏజెన్సీ ద్వారా సందర్శించడం కూడా జరిగింది. ఒక్కరోజు అక్కడ ISS లో ఉన్న వ్యోమగాములకు కావాల్సినవి చూసుకోడానికి ఒక్క రోజుకి 25 లక్షల ఖర్చు అవుతుంది.

అంతరిక్షం సబ్జెక్టు మూవీస్ లో నటించడం టామ్ కి కొత్తేమి కాదు. 2013 లో ఆబ్లివియన్ అనే సినిమాలో అంతరిక్ష వ్యోమగామిగా నటించాడు. కాకపోతే ఈ సారి నిజంగా అంతరిక్షంలోకి వెళ్లి, నిజమైన వ్యోమగామిగా చేయబోతున్నాడు.

Read Previous

షాకింగ్: నటుడు శివాజీ రాజా కి హార్ట్ స్ట్రోక్

Read Next

విశాఖ గ్యాస్ లీక్ ఫుల్ స్టోరీ: ఎలా జరిగింది, ఎంత మంది చనిపోయారు, సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఏమన్నారు