మమ్మల్ని ఇన్స్పైర్ చేసారు అంటూ ఇస్రోని అభినందించిన నాసా

చంద్రుడిపై ల్యాండ్ అవ్వటం లో కాస్త దగ్గరి వరకు వెళ్లి విఫలం చెందిన ఇస్రో ని సామాన్య జనం , మన నాయకులే కాదు ఏకంగా నాసా కూడా అధైర్యపడొద్దని భరోసా కల్పించే వ్యాఖ్యలు చేసింది.

దీని పై ట్విట్టర్ లో నాసా ట్వీట్ చేసింది. స్పేస్ పై ప్రయోగాలు చాలా కఠినమైనవని, మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని పేర్కొన్నారు. మీ ప్రయత్నమే మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని , భవిష్యత్తులో కలిసి సోలార్ సిస్టం పై పని చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.