Chandrayaan2: విక్రమ్ ఆచూకీ ఫొటోలను షేర్ చేసిన నాసా

6

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్ప కూలటంతో నిరాశ చెందిన అసలు విక్రమ్ ఆచూకీ దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఫైనల్ గా విక్రమ్ ఆచూకీ కనిపెట్టారు నాసా శాస్త్రవేత్తలు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపించింది. ల్యాండర్ కూలిపోయినట్లు దాని శకలాలు అక్కడ అక్కడ పడ్డట్టు నాసా తెలిపింది. విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది.