బిగ్ న్యూస్ : రకుల్ ప్రీత్ కి మీడియా క్షమాపణ చెప్పాల్సిందే అన్న ఎన్.బీ.ఎస్.ఏ .. టీవీ చానళ్లకు ఆదేశాలు జారీ
Timeline

బిగ్ న్యూస్ : రకుల్ ప్రీత్ కి మీడియా క్షమాపణ చెప్పాల్సిందే అన్న ఎన్.బీ.ఎస్.ఏ .. టీవీ చానళ్లకు ఆదేశాలు జారీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం సంచలనంగా మారింది. టీవీ ఛానల్స్ కూడా ఎంతోమందిని ఈ కేసుకు లింక్ చేస్తూ కథనాలు ప్రసారం చేసాయి. అయితే రియా చక్రవర్తి మరియు రకుల్ ప్రీత్ సింగ్ స్నేహితురాళ్లు కావడం, అందరూ కలిసి దిగిన ఫోటోలను సాక్ష్యంగా చూపుతూ, రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని నేషనల్ మీడియా సంస్థలు ఆమె పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రచురించాయి. అయితే వాటిని సవాల్ చేస్తూ రకుల్ కోర్టుకు వెళ్లడం జరిగింది.

కోర్టు ఈ కేసును పరిగణలోకి తీసుకొని విచారణ జరిపింది. అంతే కాకుండా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ టీవీ ఛానల్ లో రకుల్ ప్రీత్ పై ప్రచురించిన కథనాలను పరిశీలించి, అవి ఎథిక్స్ కోడ్ ను బ్రేక్ చేశాయని తక్షణమే ఆ టీవీ ఛానల్లో రకుల్ ప్రీత్ సింగ్ కి క్షమాపణలు చెప్పాలని, అది కచ్చితంగా డిసెంబర్ 17 రోజున ఆమెకు క్షమాపణలు చెప్పినట్టుగా టీవీల్లో ప్రసారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ముఖ్యంగా జీ ఛానల్ కి తెలిపింది. ఇక టైమ్స్ నౌ, ఇండియా టీవీ న్యూస్, ఆజ్ తక్, ఇండియా టుడే, న్యూస్ నేషన్ & ఏబీపీ న్యూస్ వంటి ఛానెళ్లలో ఆమెపై ప్రచురించిన కథనాలను సోషల్ మీడియా మరియు వెబ్సైట్ల నుండి తీసివేయాలని హెచ్చరించింది.

అంతే కాకుండా జీ ఛానల్ రకుల్ పై ప్రసారం చేసిన కథనాలకు వాడిన ట్యాగ్ లైన్స్ కూడా ఆమె ప్రతిష్టకు కి భంగం కలిగించే లా, వాడిన ఫోటోలు ఆమె క్యారెక్టర్ ను మిస్ లీడ్ చేసే లాగా ప్రసారం చేశాయని తెలిపింది.

Image
Image

Leave a Reply

Your email address will not be published.