Breaking News :

నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జైలులో, చెట్టు కింద భార్య

తిరుపతమ్మడి నెల్లూరు. ఆనంద్ అనే కుర్రాడిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుంది. వారికి ఒక కుమారుడు. అయితే జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ..ఒక దొంగతనం కేసులో భర్త ఆనంద్ జైలుకు వెళ్ళాడు. దీనితో తిరుపతమ్మ జీవితం రోడ్డుపైన పడింది.

ఆదరించేవాళ్ళు లేక , అనురాగం చూయించాల్సిన బంధువులు దగ్గరికి రానివ్వకపోవడంతో తిరుపతమ్మ ఒంటరిది అయింది. అయినా సరే ధైర్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలని నిర్ణయించుకొని చెట్టు కిందే తన జీవితాన్ని సాగిస్తుంది. అక్కడే తన చిన్నారి కొడుకుతో ఉంటూ ఆ చుట్టూ ఉండే వారి ఇండ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకుని కాపాడుకుంటుంది. తానూ జీవితం సాగిస్తుంది.

కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తిరుపతమ్మ జీవితాన్ని కూడా పగపట్టినట్టుంది. కరోనా భయంతో ఎవరూ ఇండ్లల్లో పనులకు రానివ్వకపోవడంతో, సంపాదన లేక, చేతులో డబ్బులు లేక, చిన్నారి కొడుక్కి పాళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది ఇపుడు.

స్థానికులు కొంతమంది తోచినంత సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతోనే బిడ్డకు పాలు కొని తెచ్చి ఇస్తోంది. ఆమె పరిస్థితిని చూసిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిత్యావసరాలు అందజేశారు. తన బిడ్డను కుక్కలు ఎత్తుకుపోతాయనే భయంతో రాత్రిళ్లు నిద్రల లేకుండా గడుపుతోంది. ఎవరైనా తనను ఆదుకొని ఆశ్రయం కల్పిస్తే కుమారుడిని బాగా చూసుకుంటానంటోంది.

Read Previous

దీక్షకు దిగిన ఆంధ్రా కాంగ్రెస్ నేతలు

Read Next

ఏపి రెడ్ జోన్ ప్రాంతాల లిస్టు : AP Redzone areas list