తెలంగాణకు కొత్త ఐఏఎస్ అధికారులు

6

తెలంగాణకు ఏడుగురు కొత్త ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్‌కు చెందిన 180 మంది అధికారుల్లో… రాష్ట్రానికి ఏడుగురిని కేటాయించారు.

వీరిలో రాష్ట్రానికి చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి, చిత్రామిశ్రాతో పాటు మహారాష్ట్ర వాసులైన పాటిల్ హేమంత్ కేశవ్, మధ్యప్రదేశ్​కు చెందిన గరిమా అగర్వాల్, ఉత్తరాంఖండ్​కు చెందిన దీపక్​ తివారీ, ప్రతిమాసింగ్, ఉత్తరప్రదేశ్​కు చెందిన అంకిత్ జాబితాలో ఉన్నారు. 2018 ఏప్రిల్ 10 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా ఈ నియామకాలు జరిగాయి. ఏపీకి 11 మందిని కేటాయించారు.