ఓటీపీ చెప్తేనే గ్యాస్ సిలిండర్ … నవంబర్ 1 నుండి కొత్త రూల్స్
Timeline

ఓటీపీ చెప్తేనే గ్యాస్ సిలిండర్ … నవంబర్ 1 నుండి కొత్త రూల్స్

నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తున్నాయి. కన్సూమర్ హక్కులను కాపాడేందుకు, అలాగే గ్యాస్ సిలిండర్లలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ కొత్త హోమ్ డెలివరీ వ్యవస్థకు డీఏసీ అని పేరు పెట్టారు. డీఏసీని డెలివరీ అథంటికేషన్ కోడ్ అని పిలుస్తారు.

గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేయదు. మళ్లీ మీరు ఈ కోడ్‌ను తెలియజేయాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డీఏసీ మెసేజ్ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాలి. అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతవరకు కోడ్ మీ వద్దనే ఉంటుంది.

ఒకవేళ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు వారి మొబైల్ నెంబర్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసుకోకపోతే.. డెలివరీ బాయ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు అప్పటికప్పుడు మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. తర్వాత కోడ్ వస్తుంది.

అయితే ఇక్కడ ఒక విషయం గర్తు పెట్టుకోవాలి. మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిన వారు లేదంటే అడ్రస్ తప్పుగా ఇచ్చిన వారు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీరికి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆగిపోవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తొలిగా 100 పట్టణాల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాయి. తర్వాత క్రమంగా ఇతర పట్టణాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తారు. అయితే ఈ కొత్త వ్యవస్థ వంట గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు వర్తించదు.

  • చమురు కంపెనీలు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డిఎసి) గా పిలువబడే కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నాయి . దొంగతనం నివారించడానికి మరియు సరైన కస్టమర్‌ను గుర్తించడంలో ఈ వ్యవస్థ సహాయపడుతుంది.
  • ప్రారంభంలో 100 స్మార్ట్ సిటీలలో డెలివరీ ప్రామాణీకరణ కోడ్ (డిఎసి) అమలు చేయబడుతుంది. రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
  • ఎల్‌పిజి సిలిండర్ల దొంగతనం ఆపడానికి, వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో డెలివరీ వ్యక్తికి కోడ్ చూపబడకుండా డెలివరీ పూర్తికాదు. వినియోగదారు యొక్క మొబైల్ నంబర్‌లో కోడ్ పంపబడుతుంది.
  • ఎల్‌పిజి సిలిండర్ల వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌ను మార్చినట్లయితే వారి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి కాబట్టి ఎల్‌పిజి సిలిండర్ల డెలివరీ ఆగిపోతుంది.
  • గ్యాస్ ఏజెన్సీతో పేర్కొన్న చిరునామా వారు నివసిస్తున్న చిరునామాకు భిన్నంగా ఉంటే వినియోగదారులు వారి నివాస చిరునామాను కూడా నవీకరించాలి.
  • అయితే, వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్లకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ (డిఎసి) వర్తించదు.

2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద వంట గ్యాస్ ఎల్‌పిజి రెసిడెన్షియల్ సెక్టార్ మార్కెట్‌గా భారత్ చైనాను అధిగమిస్తుందని అంచనా