దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: పోలీసులకు ముచ్చెమటలు

దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెలిసిందే. అయితే తరువాత జరిగిన పరిణామ క్రమంలో ఈ మృగాలను పోలీసులు కాల్చి చంపేశారు. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి విస్తుపోయే నిజాలు బయిటకి వస్తున్నాయి. అసలు బాడీలో ఒక్క బుల్లెట్ కూడా లేదని తెలుస్తుంది.

ఘటనా స్థలంలో 10 మంది పోలీసులు ఉండగా, నిందితులు ఇద్దరి వద్ద ఆయుధాలు లాక్కుని పరారైనట్లు పోలీలు తెలిపారు. మిగిలిన 8 మంది పోలీసుల్లో ఎవరి తూటాలకు నిందితులు మరణించారన్నది తేలాల్సి ఉంది. మృతుల శరీరాల్లో బుల్లెట్లు ఉంటే వాటి నంబర్ ఆధారంగా ఎవరు కాల్చారో కనిపెట్టే అవకాశముంటుందని, అయితే బుల్లెట్లు బయటకి చొచ్చుకుని రావడంతో నిర్ధారించడం తలనొప్పిగా మారింది. సంఘటనా స్థలంలో లభించిన బుల్లెట్స్, వాటి క్యాప్స్‌పై బాలిస్టిక్ విశ్లేషణ చేస్తోంది. పోలీసులకు ఎదురుతిరిగి ఆయుధాలు లాక్కున్న ఆరిఫ్, చెన్నకేశవులపై ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారన్న దానిపై లెక్క తేలాల్సి ఉంది. మొత్తానికి ఎన్‌కౌంటర్ సమయంలో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కించుకున్న తెలంగాణ పోలీసులకు, దాని దర్యాప్తు సమయంలో మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన స్వయంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. కాగా.. మంగళవారం సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి మంగళవారం ఓ నివేదికను అందజేశారు. సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ సమయంలో ఏం జరిగిందో అందులో వివరించారని, ఎఫ్‌ఎ్‌సఎల్‌ ప్రాథమిక నివేదిక, సీసీటీవీ ఫుటేజీని జతచేసినట్లు సమాచారం. వీటన్నింటినీ క్రోడీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. రీ-పోస్టుమార్టాలు, దిశ తల్లిదండ్రులు, సోదరి, నలుగురు నిందితుల తల్లిదండ్రులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికను బుధవారం సుప్రీంకోర్ట్ సమర్పించనుంది.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం