కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ కూడా తనవంతు సాయం చేసింది.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్.

ఇక నిధి సినిమాల విషయానికి వస్తే, పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
