హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి క్లాస్, మాస్ చిత్రాల్లో నటించిప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఓ బంఫర్ ఆఫర్ వచ్చిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామాలో కథానాయికగా నటించే అవకాశాన్ని ఈ నటి దక్కించుకున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇదే వార్త ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్యే నిధి ఫోటోషూట్ కు జరిగినట్లుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
‘మిస్టర్ మజ్ను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
క్రిష్ డైరెక్షన్‌లో.. పవన్ కళ్యాణ్ ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కైరా అద్వానీ, సోనాక్షి సిన్హా వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా చివరికి నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఎంఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భారీ అంచాలనున్నాయి.
ప్రస్తుతం పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది.