నిధి నీలాంటి వారివల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి: నెటిజన్

3396

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసు రోజులు గడుస్తున్న కొద్దీ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నిధి అగర్వాల్ తన ట్విటర్ ఖాతాలో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటో చూసిన నరేష్ అనే నెటిజన్.. నీలాంటి వారివల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దయచేసి ఇలా హాట్ గా కనిపించొద్దు అని కామెంట్ చేశాడు. ఇస్మార్ట్ నిధి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం నన్ను షాక్‌కు గురి చేసింది. నరేష్.. మీ అడ్రెస్ పంపండి.పింక్` అనే సినిమాను మీకు పంపుతాను.. మీకు చాలా అవసరం” అంటూ నిధి అగర్వాల్ కౌంటర్ ఇచ్చింది.