నిర్భయ దోషులకు తెల్లవారుజామున ఉరి

2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో.. న‌లుగురు నిందితుల‌కు రేపు తెల్లవారుజామున (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు ఉరి తీయ‌నున్నారు. తీహార్ జైల్లో ఉరి విధించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ కేసులో దోషులు పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌లు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమకు విధించిన ఉరిశిక్ష నిలిపివేయాలని కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సైతం ఢిల్లీ పాటియాల కోర్టు కొట్టివేసింది. దీంతో అంతకు ముందు నిర్ణయించిన మార్చి 20న ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Previous

టీటీడీ: కొండపైకి నో ఎంట్రీ

Read Next

కరోనా వైరస్: నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం