నిత్యామీనన్‌ @50: వయసు కాదు, బరువు కాదు.. మరేంటి?

నిత్యామీనన్‌ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఆమె ఒకరు.. కుప్పలుగా ఆఫర్లు వచ్చినా.. తనకు నచ్చిన.. నటకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే నిత్యా ఎంచుకుంటారని పేరుంది. గ్లామర్‌ పాత్రలకు కాస్త దూరంగా ఉండే నిత్యా మీనన్.. ఇప్పటి వరకు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాషల్లో 49 సినిమాలు పూర్తి చేసుకుని.. హాఫ్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమయ్యారు.

త‌న కెరీర్‌లో 50వ మైలురాయిని “అర‌మ్ తిరుక‌ల్పన” అనే మూవీతో చేరుకోనుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో మాలీవుడ్ న‌టుడు షైన్ టామ్ చాకో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజ‌య్ దేవ‌లోక దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.