ట్రైన్స్: నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ !
Politics Timeline

ట్రైన్స్: నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ !

No Covid-19 vaccine, no train travel

కరోనా వాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. థర్డ్ వేవ్ వస్తే, వాక్సినేషన్ తోనే సమాధానం చెప్పాలనే గట్టి నిర్ణయం కేంద్రం తీసుకోంది. ఇప్పటికే 100 వంద కోట్ల టీకా డోసులు ఇచ్చి.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయికి ఎక్కింది.

ఇక వాక్సినేషన్ తీసుకోని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు, పథకాలు ఏవి కూడా వర్తించవనే సీరియస్ షరత్తులు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ముంబై రాష్ట్రంలో లోకల్ ట్రైన్స్ లో వాక్సినేషన్ తీసుకోని కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంట్రీ లేదని రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే వారికీ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని తెలిపింది.

ఇక ముంబైలో కరోనా పరిస్థితుల గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి, రెండొవ వేవ్ లో నిర్లక్ష్యానికి ఈ రాష్ట్రంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుతం ముంబైలో అన్ని విభాగాల్లో కోవిడ్ జాగ్రత్తలను కఠినంగా పాటిస్తున్నారు.