నిన్న దీదీ, రేపు బాబు – మోడీ తో దోస్తీ కట్టాల్సిందే

5

ధానమంత్రి నరేంద్ర మోదీని బెంగాల్‌కు ఆహ్వానించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రధానితో సమావేశమైన మమతా బెనర్జీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధానిని మర్యాదపూర్వకంగానే తాను కలుసుకున్నానని, తమ సమావేశం ఫలప్రదమైందని చెప్పారు.

బెంగాల్‌లో జరుగనున్న వాణిజ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్)కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించానని, అలాగే బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చే విషయంపై కూడా ఆయనతో మాట్లాడానని చెప్పారు. దీనిపై తాను చేయగలిగినదంతా చేస్తానని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. 

దీనితోపాటు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైన బొగ్గు గని డియోచా పచామి ప్రాజెక్టు కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ప్రధానిని కోరామని చెప్పారు. ప్రాజెక్టు విలువ రూ.12,000 కోట్లని ఆమె చెప్పారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సముఖంగా ఉన్నామని ఆమె తెలిపారు. పలు అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయని, సుహృద్భావ వాతావరణంలో తమ సమావేశం జరిగిందని తెలిపారు. 

ఎన్‌ఆర్‌సీపై మీడియా అడిగినప్పుడు ఆ అంశం తమ సమావేశంలో ప్రస్తావనకు రాలేదని మమత జవాబిచ్చారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాల అనంతరం ఈ ఇద్దరు నాయకులు  కలుసుకోవడం గమనార్హం. 

ఎన్నికల ముందు దీదీ , బాబు కలిసి మోడీని పఠనం చేస్తున్నాం అన్న రేంజులో బిల్డప్ ఇచ్చారు దేశమంతా తిరిగి. ఇప్పుడేమో మళ్ళీ మోడీ గెలిచేసరికి, మోడీకి ఉన్న ప్రజాబలం చూసి బొక్కా బోర్లా పడ్డారు ఇద్దరు నాయకులు. సహసేది ఏమి లేక మోడీ దగ్గరకి చేరి కాకా పడుతుంది దీదీ. అయితే ఆంధ్రా లో వైస్ జగన్ ని ఎదుర్కోవడానికి మళ్ళీ మోడీ జత కోసం బాబు ఎదురు చూపులు మొదలయినట్టు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తున్నాయి ఈ మధ్య. అప్పుడేమో సిబిఐ వద్దని, ఇప్పుడేమో సిబిఐ కావాలని గొడవ చేస్తున్నాడు. ఏది ఏమైనా అందరూ మోడీ దగ్గరకి రావాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.