Breaking News :

ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా: మీ దేశం వెళ్లిపోండి

indian students in us

ఫారెన్ స్టూడెంట్స్ పై అమెరికా పంజా విసిరింది. కరోనా కారణం చెప్పి మీ దేశాలకు వెళ్లిపోండి అని ఆర్డర్ వేసింది. ఈ దెబ్బ మన ఇండియన్ స్టూడెంట్స్ పై గట్టి ప్రభావమే చూపనుంది. ఇకపై అమెరికా వెళ్లాలనే ఆశలు కూడా పెట్టుకోవడం మంచిది కాదనే భావన పెరిగిపోతుంది.

కరోనా కారణంగా కూలీలు కాలేజీలు మూతబడటంతో అక్కడి విద్యాలయాలు ఆన్లైన్ క్లాసులను ఏర్పాటు చేసాయి. అయితే ఆన్లైన్ క్లాసులకు అమెరికా ఎందుకు మీ దేహసం నుండే ఆ పని చేయొచ్చు అనేమో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సెప్టెంబర్‌- డిసెంబర్‌ సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్న విద్యార్థులు.. దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘వెంటనే దేశం విడిచి వెళ్లాలి. లేకుంటే క్యాంపస్‌లో తరగతులు బోధించే విద్యాలయాలకైనా బదిలీ కావాలి’’ అని ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (ఐసీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. అన్‌లైన్‌లో కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వీసాలను విదేశాంగ శాఖ కూడా మంజూరు చేయదని ఐసీఈ పేర్కొంది.

అమెరికాలో ఉండాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీలు తెరిచి క్లాసెస్ చెప్తున్న చోటికి ట్రాన్స్ఫర్ చేసుకోమని సలహా ఇచ్చింది. లేదంటే మీ దేశాలకు వెళ్లిపొమ్మని చెప్పింది.

అమెరికాలో దాదాపు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8,700 విద్యాలయాల్లో చదువుతున్నారు. అందులో అత్యధికంగా చైనా విద్యార్థులు.. తర్వాత స్థానం భారత్‌దే. మూడు లక్షల 60 వేళా మంది ఉన్నారు

ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికాలోని విద్యాలయాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తాజా నిబంధనలతో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఏసీఈ) పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో అంతర్జాతీయ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలనుకోవడం క్రూరమైన నిర్ణయమని అమెరికా సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ అన్నారు.మంగళవారం అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డేవిడ్‌ హేల్‌తో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్థన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతామని ఈ సందర్భంగా అమెరికా హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read Previous

బిగ్ బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు బాద్యులైన 12 మంది అరెస్ట్

Read Next

కరోనా హెల్ప్ కోసం ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయండి