Breaking News :

Breaking: భారీగా పెరగనున్న సంఖ్య… మోడీ ఆదేశం

వలస కార్మికుల తరలింపుపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కీలక ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు నడుపుతున్న రైళ్ల సంఖ్య ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. అయితే సంఖ్యను భారీగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాని ఆదేశానుసారం రోజుకు 300 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలు వలస కార్మికుల తరలింపునకు సహకరించాలని ఆయన కోరారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు తరలించనున్నట్లు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ఆరు రోజులుగా శ్రామిక్ రైళ్లు వలస కార్మికులను తరలిస్తున్నాయి.

Read Previous

అమ్మకు ప్రేమతో…

Read Next

బిగ్ బ్రేకింగ్: మే 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్ల సేవలు షురూ..పూర్తి వివరాలు