చిదంబరానికి బెయిల్‌: రేపు పార్లమెంట్ కు చిదంబరం
Timeline

చిదంబరానికి బెయిల్‌: రేపు పార్లమెంట్ కు చిదంబరం

కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 26న చిందంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో 106 రోజుల జైలు జీవితం నుంచి చిద్దూ బయటకు వచ్చారు. రూ. 2 లక్షల పూచీకత్తు, ఇద్దరి జమానత్తు పై బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వొద్దని సూచించింది. కోర్టు అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లవద్దంటూ షరతులు విధించింది. చిందంబరం విడుదలపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. పి. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్ కు వస్తారని చిదంబరం కుమారుడు కార్తీ జాతీయ మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.