పాక్ లో ఇండ్లపైనే కూలిన విమానం..107 మంది
Timeline

పాక్ లో ఇండ్లపైనే కూలిన విమానం..107 మంది

పాకిస్తాన్‌ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వద్ద విమానం కుప్పకూలింది. ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఎ-320 నంబర్‌ గల విమానం కూలింది. 

లాహోర్‌ నుంచి కరాచీ వెళ్తుండగా ఓ నిముషం ముందు  కూలింది. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్‌ సత్తార్‌ ధృవీకరించారు. విమానంలో 99 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, వారందరూ మృతిచెందినట్లుగా అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న మోడల్‌ కాలనీలో జనావాసాల మధ్య కుప్పకూలింది. భారీ శబ్ధంతో దట్టమైన పొగలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

 ప్రమాదం జరిగిన కాలనీలో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాలనీలో ఎన్ని మరణాలు సంభవించాయో కూడా స్పష్టత రాలేదు. ఘటనా స్థలం వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. ప్రమాద స్థలంలో ఆర్మీ, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  

Leave a Reply

Your email address will not be published.