ఆర్టికల్‌ 370 రద్దు: భారత్ తో యుద్ధం తప్పదు: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌
Timeline

ఆర్టికల్‌ 370 రద్దు: భారత్ తో యుద్ధం తప్పదు: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుంది. భారత్‌తో సహా ప్రపంచ వేదికలపై కూడా దీనికి సంబంధించిన చర్చలు తగ్గిపోతున్నాయి. కానీ దాయాది దేశం మాత్రం పూటకోసారైనా దీని గురించి తల్చుకుంటూనే ఉంది.

ఆర్టికల్‌ 370ని రద్దు చేసి భారత్‌ పెద్ద తప్పు చేసింది.. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.. యుద్ధం తప్పదంటూ బీరాలు పలుకుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా మరోసారి ఆర్టికల్‌ 370 రద్దుపై స్పందించాడు. త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగాడు. కశ్మీర్‌ లోయలో భారత్‌ విధ్వంసాలకు పాల్పడుతుందని.. హిందుత్వాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించాడు.

Leave a Reply

Your email address will not be published.