Breaking News :

దయచేసి కరోనా విషయంలో కెసిఆర్, జగన్ చెప్పింది నమ్మండి.. అందులో తప్పు లేదు

కరోనా పై నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాటిపై ఉన్న అపోహలు పోగొట్టేలా, భయబ్రాంతులకు లోనవ్వకూడదు అని కొన్ని సలహాలు చేసారు. అంతే కాకుండా బంద్ కూడా ప్రకటించారు.

అయితే ఇద్దరు సీఎం లు కరోనా వైరస్ యొక్క వ్యాప్తి గురించి చెపుతూ ఇచ్చినా సలహాలలో ఒకటి పారాసిటమాల్ ట్యాబ్లేట్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పారు. దీనిని విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు, వారి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా వారు చెప్పింది నమ్మవద్దు అని వార్తల్ని ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇది చాల దారుణం. ఇలాంటి సమయాల్లో కూడా ప్రజల భద్రత , క్షేమం గురించి ఆలోచించకుండా వేళ్ళు చేసే పని దారుణం. వీళ్ళు ఇలా ప్రచారం చేయడం వాళ్ళ చాల మంది కెసిఆర్ కానీ , జగన్ కానీ చెప్పింది అబద్దం అని నమ్మే అవకాశం ఉంది అంతే కాకుండా పొరపాటున వారికీ జ్వరం లాంటి లక్షణాలు ఉన్న కూడా పారాసిటమాల్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రజల క్షేమం కోసం ఈ ఆర్టికల్ పోస్ట్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. అసలు ముఖ్యమంత్రులు ఎందుకు అలా చెప్పారు. అందులో నిజమెంత అనే వాటిని మాట్లాడుకుందాం.

కరోనా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందా ?

తగ్గిపోదు

తగ్గిపోదు అనుకున్నపుడు ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు అలా చెప్పారు?

కరోనా కి మందు లేదు. కానీ కరోనా లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు చివరగా శ్వాస తీసుకోలేకపోవడం. అయితే మొదటి 3 లక్షణాలు ఉన్నప్పుడు మనం జ్వరానికి విరుగుడుగా ప్రపంచమంతా వాడే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా నుండి బయటపడొచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నది.

కావాలంటే కరోనా కేసుల్లో రికవరీ అయినా వాళ్ళు ఉన్నారు .. మందు లేకపోతే మరి వాళ్ళు ఎలా రికవరీ అవుతున్నారు? ప్రభుత్వం చెప్తున్నట్టు వారిని ఒక ఐసోలేషన్ గదిలో పెట్టి వారి ఇమ్మ్యూనిటి సిస్టం మెరుగుపడేలా ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ కూడా వారికీ ఉన్న ఈ జ్వరం , దగ్గు , జలుబు తీవ్రత ఎక్కువ కాకుండా ఇచ్చే మందులు కూడా ఈ పారాసిటమాల్ లాంటివే. మన రాష్ట్ర ముఖ్యమంత్రులే కాదు ఫ్రెంచ్ హెల్త్ మినిస్టర్ కూడా ఇదే సలహా అక్కడి ప్రజలకు ఇచ్చారు.

దానికి సంబందించిన కొన్ని లింక్స్ ని క్రింద పోస్ట్ చేస్తాము.

https://www.theguardian.com/world/2020/mar/14/anti-inflammatory-drugs-may-aggravate-coronavirus-infection

https://economictimes.indiatimes.com/news/politics-and-nation/indians-dont-need-to-panic-yet-about-coronavirus-says-leading-researcher/articleshow/74492091.cms

ఇక బ్లీచింగ్ పౌడర్ గురించి ట్రోల్ చేసే వారికీ ఏం చెప్పిన అర్ధం కాదేమో, చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడమే ఇలాంటి సమయాల్లో మనం చేయాల్సిన మొదటి పని. అందుకే ఆ సలహా ఇచ్చారు. అంటే కాకుండా వైరస్ అనేది వస్తువుల పై ఎక్కువ సమయం ఉండలేదు . చచ్చిపోతుంది. బ్లీచింగ్ పౌడర్ ఒంటి మీద వేసుకోము కదా .. చుట్టూ ఉన్న వాటిపైనే వేస్తాం. శరీరాన్ని అయితే సబ్బుతో కడుక్కోండి. చేతులు ఎందుకు కడుక్కోవాలి అంటే మనిషి ఒక రోజుకి 2 వేల నుండి 3 వేల సార్లు తన చేతులతో ముఖాన్ని తడుముకుంటాడు. వస్తువుల తాకడం ద్వారానో, వైరస్ ఉన్న వ్యక్తిని తాకడం ద్వారానో చేతికి ఆ వైరస్ కనుక తాకి ఉంటె , ఆ చేతితో మనం ముఖాన్ని తాకే అవకాశాలు ఎక్కువ దాని ద్వారా వైరస్ మనకు సోకె అవకాశాలు కూడా ఎక్కువ.

ఇలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో రాజకీయాల కోసం ఇలాంటి పరిస్థితులను వాడుకొని ఇంటర్నెట్ లో వచ్చే జోక్స్ ని , ట్రోల్ల్స్ ని నమ్మే మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే పారాసిటమాల్ వేసుకోండి. తీవ్రత ఎక్కువైతే వెంటనే డాక్టర్ ని సంప్రదించి , ప్రభుత్వ అధికారులకు తెలిజేయండి. దీని వలన మీకు , మీ అనుకున్న వాళ్లకు అందరికి ఏంటో మేలు చేసిన వారు అవుతారు.

సీఎం పదవిలో ఉన్నపుడు ఎవరైనా అలానే చెప్తారు. అలానే చెప్పాలి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు బయాందోళనలకు గురి అయ్యేలా చేయడం వాళ్ళ ఎన్నో డేంజర్ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వైరస్ తీవ్రత ఎక్కువ లేనప్పుడే మీడియాలో వార్తలు , ఇంటర్నెట్ లో చూసి మనం మాస్కుల గురించి చాల బయపడ్డాం. మాస్కులు అధిక ధరకు అమ్మడం జరిగింది. మార్కెట్ లో కూడా ప్రొడక్షన్ లేదు. మనం ఇంకా ప్యానిక్ అయ్యేలా ప్రభుత్వాలు వ్వవహరిస్తే చాల ఘోరాలు జరగొచ్చు. బయట బిజినెస్ లు చేసే వాళ్లకు కూడా వాళ్ళ ఆరోగ్యం అంటే భయమే ఉంటుంది. వాళ్ళు బిజినెస్ లు చేయటం ఆపేస్తే మనకే నష్టం. ఇప్పుడు మాస్కులు మాత్రమే దొరకట్లేదు రేపు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ప్రభుత్వాలు నెమ్మదిగా చెబుతాయి, వెనక మాత్రం వాళ్ళు చేసే చర్యలు చేస్తారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలను ప్రశ్నించి , అపనమ్మకం ఏర్పరుచుకోవడం వాళ్ళ నష్టపోయేది మనమే. ఆ సీఎం లు కూడా రాజకీయం చేయాలనుకుంటే కెసిఆర్ అసెంబ్లీ లో మోడీ ప్రభుత్వాన్ని సమర్ధించేవాడా?

వీలైనంత వరకు బయటకు వెళ్ళకండి. ఎక్కువ మంది ఉన్న చోట ఉండొద్దు. శరీరం తో పటు చుట్టూ ఉన్న వస్తువులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

మళ్ళీ చెప్తున్నాం : ఈ వైరస్ డేంజర్, కానీ బయపడి ప్రభుత్వాలు ఏదో చెయ్యాలి అని మనం ఏదో అయిపోవద్దు. మన జాగ్రత్తలో మనం ముందుగా అన్ని చర్యలు తీసుకోవాలి. అది గుర్తుంచుకోండి.

Read Previous

కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ సార్క్ వీడియో కాన్ఫరెన్స్

Read Next

మేమిద్దరం సింగిల్ గా ఉన్నందువల్లే పుకార్లు: అనుష్క