పవన్ కీలక వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో రాజధాని తరలింపుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కాంగ్రెస్, బీజేపీ తమ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్ట ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి కూడా బాధ్యత వుందని, అందుకోసమే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు పవన్ కల్యాణ్. కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని ఆయన అన్నారు.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం