సాక్షి లో సైరా ఈవెంట్, పవన్ స్పీచ్ కట్

213

తెలుగు ఇండస్ట్రీ లో ఏ సినిమా ఈవెంట్ అయినా దాని ఆడియో లాంచ్ లైవ్ టెలికాస్ట్ కు ఉండే డిమాండ్ చాలా ఎక్కువ. ఆ డిమాండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దానికి కారణం ఆడియో లాంచులే కాదు ఇపుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో నిర్మాతలకు జేబుకి చిల్లు కూడా ఎక్కువే అవుతుంది.

ఏది ఏమైనా ఈ ఈవెంట్లను లైవ్ టెలికాస్ట్ తమ తమ ఛానళ్లలో ప్రసారం చేసుకోడానికి తెలుగు న్యూస్ చానళ్ళు పోటీ పడుతుంటాయి. ఈ పోటీలో ఎప్పుడు కలిసి మెలిసి ముందుండేవి TV9 & NTV. కానీ ఈ సరి బిన్నంగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షి టీవీ లో మరియు జెమినీ టీవీ లో ప్రసారం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం.

అయితే సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షి లో ప్రసారం అనేదే పవన్ అభిమానులకు , జనసైనికులకు కాస్త ఆశ్చర్యంగానూ. కాస్త బయంగాను కలిగించే మ్యాటర్ అయిపోయింది. ఇప్పటికే దీని మీద ఇంటర్నెట్ లో రచ్చ మొదలైంది. అంతేలే వాళ్లకు ఆ డౌట్స్ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు.

అసలే పవన్ కళ్యాణ్, సాక్షి బంధం అందరికి తెలిసిందే. ఇపుడున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే అది ఇట్టే అర్ధం అయిపోద్ది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆ ఈవెంట్ కి అటెండ్ అయితే ఎక్కడ పవన్ స్పీచు లైవ్ లో కట్ చేస్తారో అని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ లో. ఈ ట్వీట్ కింద కామెంట్లు చుడండి.