కెసిఆర్ బొమ్మలు యాదాద్రి గుడి పై చెక్కారని తెలంగాణ లో జరుగుతున్నా రచ్చ మనకు తెలిసిందే. అయితే ఆ ఆలయ డిజైన్ పనులు చూసుకునేది ఎవరో తెలుసా. ఆనంద్ సాయి అనే ఆర్ట్ డైరెక్టర్. అయన ఎవరో కాదు , పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు, అత్యంత సన్నిహితుడు కూడా.
తాను సినిమాలకే కాదు, లావిష్ గా పెళ్లి పందిర్లు వేయడం లో దిట్ట. సినిమా సెట్లను తలపించే రేంజులో తన వర్క్ ఉంటుంది. ఎంతో మంది సెలెబ్రెటీలకు కూడా ఆనంద్ పెళ్లి పందిర్లు వేసాడు.


