పవన్ తో బీజేపీ దోస్తీ! వైసీపీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది?

15

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్… అదే జరిగి ఉంటే… వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్… తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లు గెలిచిన టీడీపీ పార్టీను వదిలేసి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలైపోయి కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న జనసేన పార్టీను అలాగే పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుండడం ఏపీ రాజకీయాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది.టీడీపీ కంటే తీవ్ర స్థాయిలో ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీను వైసీపీ ఇంతలా కాన్సన్ ట్రేట్ చేస్తుండడంతో రాష్ట్ర ప్రజలు కూడా అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం టీడీపీయా లేక జనసేనా అన్న మాటలు మాట్లాడుకుంటున్నారు.

అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా పవన్ వల్ల తమకు ముప్పు ఉంటుంది అని వైసీపీ భావిస్తుందో ఏమో కానీ అసలు పవన్ ఒక్క మాట అనడం భయం వైసీపీలో కీలక నేతలే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒక రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు.అయితే అసలు వీరు పవన్ విషయంలో చేస్తున్న విమర్శలు పదే పదే రాష్ట్ర ప్రజలపై రుద్దేవిలాగానే కనిపిస్తున్నాయి.అలాగే ఇక పవన్ పై ఎలాంటి గత్యంతరం లేక ఈ విమర్శలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి.అసలు పవన్ ను వారు ఇంతలా టార్గెట్ చెయ్యడం ఎందుకు?వారికి అంత అవసరమా?పవన్ కు రాజకీయాలే తెలీదు అంటారు.

ఒక్క సీటు మాత్రమే వచ్చింది అని హేళన చేస్తారు.రెండు చోట్ల ఓడిపోయావు ప్రజలు నిన్ను పొర్లు దండాలు పెట్టించి మరీ కొట్టారు అని వీళ్ళే అంటారు.అలాంటి వ్యక్తిని ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అంటే వారి నుంచి సరైన సమాధానం లేకపోగా మనః”సాక్షి” అంటారు.ఇలా పవన్ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒకింత అనుమానం కలగట్లేదా..?ముఖ్యంగా అయితే పవన్ విషయంలో వైసీపీ నుంచి ప్రధానంగా వినిపించే రాజకీయ విమర్శలు కాదు విమర్శ పవన్ చంద్రబాబు పార్ట్నర్స్ అని.

పవన్ చంద్రబాబు డైరెక్షన్ లో మాట్లాడుతాడు ప్యాకేజీ తీసుకున్నాడు.బాబుకి కాల్షీట్ లు ఇచ్చాడు ఇలా ఎంతసేపు పవన్ ను చంద్రబాబుకు అంటగట్టడం తప్ప వీరి నుంచి మరో రాజకీయ విమర్శ రావడం లేదు.అలాగే తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని అన్న మాటలైతే మరీ విడ్డూరంగా ఉన్నాయి.పవన్ ని జైల్లో వేస్తారన్న భయంతో అమిత్ షాను పొగుడుతున్నారట.అసలు ఈ కామెంట్స్ దగ్గరే వైసీపీ పవన్ విషయంలో తేలిపోయింది అని చెప్పొచ్చు.అసలు పవన్ జైలుకు వెళ్లడం ఏమిటి?అతనేమన్న రాజకీయాల్లోకి వచ్చి అక్రమంగా కోట్లు పోగేసుకొని ప్రజలను మోసం చేసాడా అని జనసేన శ్రేణులు అంటున్నారు.

ఇక్కడే వైసీపీ పవన్ విషయంలో దుష్ప్రచారం చెయ్యడానికి చంద్రబాబుతో అక్రమ సంబంధం పెట్టడం తప్ప మరో బలమైన దారి కనిపించడం లేదా అని అర్ధం అవుతుంది.ఇదైతే జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది పవన్ దెబ్బ తిన్నాడు.మరి వీరిద్దరూ కలిసే ఉన్నట్టయితే మనఃసాక్షి లాంటి మాటలు మాట్లాడకుండా అధికారంలో ఉండి ఎందుకు కనీసం నిరూపించే ప్రయత్నం చెయ్యకుండా కాల క్షేపం చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచించాలి.సరే పవన్ ఏదో ఆశించి బీజేపీపై సానుకూలంగా మాట్లాడారు అనుకుందాం.

మరి మోడీ విషయంలో జగన్ చేస్తుంది ఏమిటి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడులా ఇప్పుడు మోడీపై అసలు నోరే ఎత్తలేకపోతున్నారు. ఒకవేళ నోరెత్తితే తర్వాత రిపీట్ అయ్యే సీన్ ఎలా ఉంటుందో కూడా వైసీపీ నేతలకు తెలుసు మరి అలాంటాప్పుడు పవన్ పై ఇలాంటి విమర్శలు చెయ్యడం తగునా..? అన్నది వారు ఓ సారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. అలాగే మొన్న తిరుపతి సభలో పవన్ ఓ పాయింట్ లేవనెత్తారు.తాను టీడీపీకి బి టీం అయితే వైసీపీ టీడీపీ 60-40 రాజకీయాలు చేస్తున్నట్టుగా మాటలు మాట్లాడారు. ఇన్ని రోజులు పవన్ ఏది ప్రశ్నించిన బాబు ఆఫీస్ నుంచి వచ్చే పత్రమే అని చెప్పుకునే వైసీపీ, ప్రస్తుతం బీజేపీ, జనసేన వైఖరి చూస్తుంటే భవిష్యత్ లో కలిసి పనిచేస్తారనే మాట వినిపిస్తుంది. అప్పుడు వైసీపీ పరిస్థితి ప్రత్యేక హోదాతో పాటుగా, కేంద్రంతో సఖ్యత లేకుంటే నిధుల కేటాయింపు విషయంలోను వైసీపీకి చాలా కష్టంగా ఉంటుందనేది విశ్లేషకుల మాట.