న్యూస్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ .. అవాక్కయిన అభిమానులు

రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్న తరువాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇక సినిమాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. గత సంవత్సరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం సైరా నరసింహ రెడ్డి ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆ తరువాత ఒక మాస్ సినిమా చెయ్యాలన్న ఉద్దేశంతో కొరటాల శివతో సినిమాకి ఒప్పుకున్నారు చిరు. ఆ చిత్రమే ఆచార్య.

ఆచార్య కథ కూడా ఇప్పుడు వివాదాల్లో పడింది. మరోవైపు కరోనా కన్నెర్ర చేయడంతో షూటింగ్ కూడా ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు సెట్స్ కి వెళుతుందో తెలియదు. ఇక ఆ తరువాత మెహర్ రమేష్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలు షికారు చేసాయి కానీ ఎవరూ వాటిని ధ్రువీకరించలేదు.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు సెలెబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి అయన కూడా రెప్లైలు ఇచ్చే ప్రోగ్రామ్ ఈరోజు పెట్టుకున్నారు. దానిలో భాగంగా మెహర్ రమేష్ కి థాంక్యూ అని చెప్తూ కొనసాగింపుగా మీరు చిరంజీవితో చేయబోయే సినిమాకు నా బెస్ట్ విషెస్ అంటూ ఆ వార్తను ద్రువీకరించేసారు.

దీనితో పవన్ కళ్యాణ్ ఈ వార్తను ఇలా లీక్ చేసారేంటనే డైలమాలో పడిపోయారు మెగా అభిమానులు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ వార్త అబద్దం కాదు అనే క్లారిటీ అయితే ఇచ్చేసారు.