వీరి భేటీలు ఇందుకేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి దగ్గరకావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. జగన్ కు ఇప్పుడు కేంద్రం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా జగన్ బలంగా ఉన్నా సరే కేంద్రం ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. దీనితో జగన్ లో ఒకరకమైన ఆందోళన అనేది ఉంది.కెసిఆర్ మద్దతు ఉంటే తాను నిలబడగలను అని జగన్ భావిస్తున్నారు. అందుకే ముందు తాను నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు కెసిఆర్ మద్దతు కోరారు జగన్.
మూడు రాజధానులు అనేది జగన్ కు ఇప్పుడు కీలకం. అందుకే కెసిఆర్ మద్దతు ఉంటే కేంద్ర౦తో ఇబ్బంది ఉండదు అనే భావనలో జగన్ ఉన్నారు. కేంద్రం ఈ విషయంలో ఇప్పటి వరకు తన అభిప్రాయం ఏంటీ అనేది చెప్పలేదు. ఇక అది పక్కన పెడితే జనసేన బిజెపి కలిసి ముందుకి వెళ్ళే ఆలోచన చేస్తున్నాయి. దీనితో తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ మద్దతు ఉంటే తనకు అదనపు బలం అని, అందుకే ఆరు గంటల సేపు కెసిఆర్ తో జగన్ సమావేశం నిర్వహించి, మూడు రాజధానుల గురించే ఎక్కువగా చర్చించారని, సాధ్యా సాద్యాలను వివరించారని అంటున్నారు.

కొత్త వార్తలు