పవన్ ను కలిసి మద్దతు తెలియజేసిన బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల

19

జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన నది – మన నుడి ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. పవన్ తో భేటీ అనంతరం బుద్దప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… మాతృభాష పరిరక్షణకు నడుం కట్టిన పవన్ ను అభినందిస్తున్నట్టు చెప్పారు. మననది – మన నుడి కార్యక్రమం ద్వారా తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. సమగ్ర తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి పవన్ కృషి చేస్తున్నారన్నారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ తో భాషాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించాం. ఆయన ఒక బలమైన సంకల్పంతో తెలుగు భాష పరిరక్షణ, నదుల కాలుష్యాన్ని నివారించేందుకు కంకణం కట్టుకున్నారు” అని అన్నారు.