పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న పవన్ కళ్యాణ్

12

జగన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చివేయాలని ఇచ్చిన ఉత్తర్వులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భాషా పరిరక్షణ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ 2017లో ప్రచురించిన ‘తొలిపొద్దు’ కవితా సంకలనాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఈ సంకలనంలో 442మంది కవుల కవిత్వాన్ని ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో నిర్వహించిన తెలుగు మహాసభల సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే.. జగన్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

అల్లాగే “తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలలో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ,ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కాగా, ఇంగ్లీష్ మీడియంలో బోధనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు భాష ఉనికి మరింత ప్రమాదంలో పడుతుందని కొంతమంది భాషా ప్రియులు వాపోతున్నారు.