తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ రాష్ట్రంలో బీజేపీ మరియు జనసేన ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షలు కొనసాగిస్తారు అని తెలియజేసారు.
న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ ధియోదర్ లు దీక్షకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు మరియు జనసేన నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.
టీటీడీ ఆస్తులను విక్రయించాలని 2016 జనవరిలో చంద్రబాబు హయాంలో ఉన్న అప్పటి టీటీడీ బోర్డు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని టీటీడీ కి సలహా ఇస్తూ సోమవారం నాడు రాత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో సదావర్తి భూముల విషయంలో, టీటీడీ భూముల విక్రయం విషయంలో వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
అయితే ఇపుడు రాష్ట్రంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల భూములను పరిరక్షించడం కోసం బీజేపీ మరియు జనసేన కలిసి ఉపవాస దీక్షలు చేస్తున్నాయి.
అయితే బీజేపీ జనసేన పొత్తుగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ జనసేన కలిసి చేస్తున్న ఈ ఉపవాస దీక్షపై జనసేన అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం బీజేపీ కావాలనే పవన్ కళ్యాణ్ ఫోటోను బ్యానర్లలో లేకుండా చేసిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జనసేన లోగో ఉంది , బీజేపీ లోగో ఉంది, వాటితో పటు కేవలం బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే ఉండటం వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
అంతే కాకుండా హిందూ దేవాలయ భూములను పరిరక్షించే చట్టం రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకు రావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయాలనీ సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలు, సామాన్య ప్రజలు కామెంట్స్ చేస్తుండటం తో జనసేన కాస్త ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది.