పవన్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ ‘పింక్’ సినిమా షూటింగ్ జనవరి 20 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. లైంగిక హింసకు గురై, న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథగా రూపొందే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల (‘మల్లేశం’ మూవీ నాయిక) నటిస్తున్నారు.

కొంతమంది యువకుల అరాచకానికి బాధితులుగా మారిన ఆ ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే లాయర్‌గా పవన్ కల్యాణ్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాని పూర్తిచేయడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం 15 రోజుల కాల్షీట్స్‌కు ఆయన రూ. 50 కోట్లు అందుకుంటున్నారనే ప్రచారం ఫిలింనగర్‌లో నడుస్తోంది.

కొత్త వార్తలు