నాగబాబు క్రమశిక్షణ తప్పాడా?..పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్
Timeline

నాగబాబు క్రమశిక్షణ తప్పాడా?..పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్

ఎప్పుడు సోషల్ మీడియా లో సమయం సందర్భం లేకుండా ఏదో ఒక కాంట్రవర్సీ అయ్యేలా ట్వీట్లు చేసే వ్యక్తి తెలుగు లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఆర్జీవీ అని కుండబద్దలు కొట్టేలా చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అయితే ఈ మధ్య ఆర్జీవీకి పోటీగా నాగ బాబు కూడా జాయిన్ అయ్యారు. మొన్నటి వరకు యూట్యూబ్ లో నా ఇష్టం అని ఛానల్ పెట్టేసి నానా రచ్చ చేశారు కొన్ని అంశాలపై. ఇపుడు ట్విట్టర్ లో కూడా అదే పని మొదలుపెట్టారు.

నాథురాం గాడ్సే గాంధీ కన్నా గొప్పవాడు, దేశభక్తుడు అని, ఈ రోజేమో కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ఒక్కటే ఉండాలా, గాంధీ కన్నా ఎక్కువగా దేశం కోసం పోరాడిన వారి బొమ్మలు వెయ్యరా అంటూ ట్వీట్లు చేశారు.

ఇపుడు ఈయన ట్వీట్లు రాజకీయ దుమారం కూడా లేపాయి. అసలే ఓట్లు పడక, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియక, 6 నెలల్లో 6 పార్టీలతో చేయి కలిపిన జనసేన ఇప్పుడిప్పుడే బీజేపీ పేరు చెప్పుకొని కాస్త, మేము కూడా ఉన్నాం అంటూ ప్రజలకు తెలియచేసే పనిలో పడింది.

ఇంతలోనే కరోనా దెబ్బ కూడా ఆ పార్టీపై గట్టిగానే పడింది. అయితే పవన్ మాత్రం కరోనా సమయం లో రాజకీయాలకు దూరంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు , అభిమానులకు ఆదేశాలిచ్చారు.

ఆయనేమో ఇలా చెప్తే, అన్నయ్య నాగబాబు మాత్రం ఇలా కాంట్రవర్సీ ట్వీట్లు చేయడంపై పార్టీలోనే చాలా మందికి మింగుడు పడటంలేదట. పవన్ అభిమానులే నాగ బాబు వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు సోషల్ ఇండియాలో. ఇపుడు ఈ మ్యాటర్ పవన్ దగ్గరకు కూడా వెళ్ళింది.

పవన్ నాగబాబు ని మందలించారా లేదా ఏమో కానీ, ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేసారు. అందులో కొన్ని లైన్లు చాలా ఘాటుగానే ఉన్నాయి.

పార్టీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా లో పెట్టె అభిప్రాయాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప పార్టీ అభిప్రాయాలు కాదు. పార్టీ అభిప్రాయాలు కేవలం పార్టీ పేజీల్లో మాత్రమే అధికారికంగా పెడుతాం అని తెలియజేసారు.

అంతే కాకుండా నాగబాబు పేరు పెట్టి మరీ అయన వ్యాఖ్యలను పార్టీ అబిప్రాయాలుగా చూడొద్దని తెలియజేసారు. ఎవరైనా క్రమశిక్షణ అతిక్రమించకుండా ముందుకు సాగాలని ఘాటుగా స్పందించారు.

అంటే నాగబాబు వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని, క్రమశిక్షణ అతిక్రమించారని పవన్ ఫీల్ అవుతున్నారా అని సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published.