Breaking News :

ఇంగ్లిష్ మీడియం వల్ల మత ప్రచారాలకు ఇబ్బంది అంటున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు మాధ్యమం విషయం లో పట్టు వదలడం లేదు. వైసీపీ నేతలు వ్యక్తిగతపరమైన విమర్శలు ఎన్ని చేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉండాలి అన్నట్లుగానే పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మనోవికాసానికైనా, మత ప్రచారానికైనా మనకు తెలిసిన భాషలో చెప్పినప్పుడే సామాన్యులకు సులభంగా అర్ధం అవుతుంది. అయితే ఇక్కడ పొందుపరిచిన వీడియోల్లో ఉన్న స్తోత్రాలు ఇంగ్లీష్ లో చెబితే శోభిల్లుతాయా? అంటూ పవన్ ప్రశ్నించారు. సామాన్యులకు అర్ధం అవుతాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాదు గనుకే సంస్కృత సమ్మిళితంగా మన తెలుగులో స్తుతించారు. గానం చేసారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అందుకే మన భాషను మన సంస్కృతిని గౌరవించుకోవాలి అని పవన్ అన్నారు. ఇప్పటీకే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ఆదేశాలు జారీ కూడా అయ్యాయి. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కానుంది.

Read Previous

ఇంటర్వ్యూ : అనిల్ రావిపూడి – సరిలేరు నీకెవ్వరు ముచ్చట్లు

Read Next

కెసిఆర్ కి రేవంత్ సవాల్