సెటైర్లు వేయడం ఆపేసి నిన్ను నువ్వు ప్రశ్నించుకో పవన్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలుపుతూనే సెటైర్లు కూడా వేశారు.

నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు వంటివి లేవని, తాను అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని అన్నారు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే అని, నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి అని అన్నారు. అయితే ఇవన్ని లక్ష్మీ నారాయణ గారు తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని, ఆయన పార్టీకి రాజీనామా చేసినప్పటికి వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికి అలాగే ఉంటుందని, చివరగా ఆయనకు శుభాభినందనలు తెలుపుకుంటూ పవన్ ఓ లేఖను విడుదల చేశారు.

ఎన్నికల ముందు ఇక పూర్తి కాలం ప్రజా సేవకే అని డైలాగులు ఎందుకు చెప్పారు? మరి వేరే రాజకీయ నాయకులు వ్యాపారాలు చేస్తే తప్పా ? ఈయన జీవనాధారం సినిమాలు అయితే వాళ్లవి వ్యాపారాలు. ఈయన ప్రతి సారి నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పవర్ ప్రాజెక్టులు లేవు అని ఎందుకు ఏడవడం? వాళ్ల వ్యాపారాలను ఈయన విమర్శించొచ్చా ? ఈయన లాగా వాళ్లు మేము వ్యాపారాలు మానేస్తాం అనలేదుగా ? అని పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమాలు చేయడం తప్పు కాదు కానీ సినిమాలు చేయను, ప్రజలకే న జీవితం అంకితం అని, అవన్నీ వదిలేసి త్యాగం చేశాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాటి పాటికి అందరిపై ముఖ్యంగా తనను వదిలి వెళ్లిపోయేవాళ్లపై సెటైర్లు వేయడం పవన్ కే నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

అయినా అసలు పవన్ సినిమాలు ఎప్పుడూ మానేయలేదు, అందరు పెద్ద హీరోలలానే సంవత్సరానికో, 2 సంవత్సరాలకో సినిమా చేస్తూనే వచ్చాడు. సినిమాలు వదిలేయడం, మళ్ళీ సినిమాలు చేయడం ప్రజా సేవలా పవన్ ఫీల్ అయితే ఇక పార్టీ నిలబడటం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Previous

చపాతి రాత్రి తింటే ఏమవుతుంది?

Read Next

హిందూపురంలో బాలకృష్ణ కు దబిడి దిబిడి

Leave a Reply

Your email address will not be published.